calender_icon.png 13 November, 2025 | 7:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఎస్సై పేరుతో సైబర్ మోసం రూ.75 వేలు స్వాహా

20-05-2024 12:55:33 AM

సూర్యాపేట, మే 19 (విజయక్రాంతి): సైబర్ నేరగాళ్లు గతంలో ఓటీపీ నంబర్ చెప్పించుకొని అకౌంట్లలో ఉన్న డబ్బులు స్వాహా చేసేవారు. కానీ ఈ కేటుగాళ్లు చివరకు పోలీసుల పేర్లను కూడా వాడుకుం టున్నారు. తాజాగా ఇలాంటి ఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. నేరేడుచర్లలో పెట్రో ల్ బంక్ నిర్వహిస్తున్న రాజకొండ రామకోటేశ్వరరావుకు పట్టణ పోలీస్ స్టేషన్ ఏఎస్సై సత్యనారాయణరెడ్డి పేరుతో ఫోన్ చేసిన ఆగంతకుడు ‘నేను ఏఎస్సైని మాట్లాడుతున్న.. మా ఎస్సై కూతురికి సీరియస్‌గా ఉంది..

నేను నీకు రూ.75 వేలు నగదు ఓ వ్యక్తితో పంపిస్తున్నా.. వెంటనే నాకు ఫోన్‌పై ద్వారా ఆ మొత్తాన్ని పంపండి’ అని చెప్పాడు. రామకోటేశ్వరరావు తన అకౌంట్‌లో అంత మొత్తం లేదని చెప్పగా.. తెలిసిన వారిని అడిగి పంపించాలని కోరాడు. దీం తో తన స్నేహితుడిని అడిగి అతను పంపిన క్యూఆర్ కోడ్ ద్వారా పంపించాడు. అయితే ఎంతసేపటికి ఏఎస్సై పంపిస్తా అని చెప్పిన వ్యక్తి రాకపోవడంతో తాము మోసపోయామని గ్రహించి పోలీసులను సంప్రదించారు. ఈ విషయంపై విచారణ చేస్తున్నామని ఎస్సై రవీందర్ నాయక్ తెలిపారు.