calender_icon.png 15 October, 2025 | 5:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ బంద్​కు బీజేపీ మద్దతు

15-10-2025 02:02:59 PM

హైదరాబాద్: తెలంగాణలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో అమలు చేసిన విషయం తెలిసిందే. బీసీ రిజర్వేషన్లకు జీవో నంబర్ 9ను జారీ చేసింది. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీ సంఘాలు అక్టోబర్ 18న రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు.

బీసీ జేఏసీ నేతలు రాష్ట్ర బంద్ కు మద్దుతూ కోరుతూ పలువురు రాజకీయ పార్టీల నేతలను కలుస్తున్నారు. ఈ క్రమంలోనే  బీసీ సంఘం అధ్యక్షులు, ఎంపీ ఆర్.కృష్ణయ్య, బీసీ నేతలు తెలంగాణ బీజేపీ కార్యాలయానికి వెళ్లి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావును కలిశారు. బీసీ సంఘాలు తలపెట్టిన బంద్ కు మద్దతిస్తామని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే బీజేపీ కార్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫోటోల విషయంలో బీసీ సంఘం నేతల మధ్య పరస్పర వాగ్వాదం జరిగినట్లు సమాచారం. రామచందర్ రావు, ఆర్.కృష్ణయ్య ఎదుటే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.