15-10-2025 01:00:24 PM
అందరి ఆమోదంతో డిసిసి ఎన్నిక.
ఏఐసీసీ ఇన్చార్జి సూరజ్ సింగ్ ఠాకూర్.
మహమ్మదాబాద్: పార్టీ సంక్షేమం కోసం పాటుపడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ అడుగులు వేసిన వారికే పదవులు వరిస్తాయని ఏఐసీసీ ఇన్చార్జి సూరజ్ సింగ్ ఠాకూర్(AICC in-charge Suraj Singh Thakur) స్పష్టం చేశారు. మండల పరిధిలోని దేశాయిపల్లి గెట్ లో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఫంక్షన్ హాల్ లో వికారాబాద్ జిల్లా డిసిసి అధ్యక్షులు,పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి అధ్వర్యంలో. మహమ్మదాబాద్. గండీడ్. మండలాలకు చెందిన. నాయకులతో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ జిల్లాస్థాయి సంఘటన్ సృజన్ అభియాన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్చార్జిగ సూరజ్ సింగ్ ఠాగూర్ మాట్లాడారు.ప్రజా పాలనలో ప్రతి ఒక్కరికి మేలు చేయాలని సంకల్పంతో గ్రామస్థాయి నుంచి కూడా డిసిసి అధ్యక్ష రేసులో ఉన్న వారి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని స్పష్టం చేశారు.
అందరికీ సముచిత స్థానం కల్పించడం పార్టీ లక్ష్యంగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో పదవులు ఎవరికి వచ్చిన పార్టీ లైన్ దాటకుండా ఉంటూ పార్టీ, ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని సూచించారు. నిజమైన కార్యకర్తలకే అవసరమైన గుర్తింపు లభిస్తుందని తెలిపారు. వికారాబాద్. డిసిసి అధ్యక్ష పదవి గురించి దరఖాస్తులు స్వీకరించారు.ఈ కార్యక్రమంలోటీపీసీసీ నుండి ఎస్టీ సెల్ నాయకులు బెల్లయ్య నాయక్. టీపిసీసీ ఉపాధ్యక్షులు. నీలిమ, వేణుగౌడ్, శత్రు. పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రిత్విక్ రెడ్డి,పీసీసీ మెంబర్ నర్సింహ్మా రావు. మహమ్మదాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేఎం నారాయణ,గండీడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జితేందర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ లక్ష్మీనారాయణ, మాజి ఎంపీపీ శాంతి రంగ్యా,ఏదుల శంకరయ్య, రాధ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.