15-10-2025 01:44:02 PM
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు(Jubilee Hills by elections) ముందు మీడియా ఎగ్జిట్ పోల్స్(Exit polls) పై నిషేధం విధిస్తున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (Greater Hyderabad Municipal Corporation) బుధవారం ప్రకటించింది. నవంబర్ 6న ఉదయం 7:00 గంటల నుండి నవంబర్ 11న సాయంత్రం 6:30 గంటల వరకు నిషేధం అమలులో ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఇది టెలివిజన్, రేడియో, వార్తాపత్రికలు, సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లతో సహా అన్ని మీడియా ఛానెళ్లకు వర్తిస్తుంది. ఉల్లంఘిస్తే ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 ప్రకారం జైలు శిక్ష లేదా జరిమానా విధించబడుతుంది" అని తెలంగాణ సమాచార, ప్రజా సంబంధాల శాఖ పేర్కొంది. జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి. కర్ణన్(R.V. Karnan) ఎన్నికల నియమాలను కచ్చితంగా పాటించాలని అన్ని వర్గాలను కోరారు.