calender_icon.png 15 October, 2025 | 5:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీనియర్ సింగర్ రావు బాలసరస్వతీ దేవి కన్నుమూత

15-10-2025 02:09:37 PM

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. తెలుగు సినిమా తొలి మహిళా గాయని, నటి రావు బాల సరస్వతీదేవి(Rao Balasaraswathy Devi passes away) కన్నుమూశారు. బుధవారం ఉదయం మణికొండలోని నివాసంలో రావు బాలసరస్వతీ దేవి తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 97 సంవత్సరాలు. బాల సరస్వతిదేవి లలిత సంగీత దిగ్గజంగా పేరు పొందారు. 1939లో మహానంద సినిమాతో తొలి నేపధ్య గాయనిగా గుర్తింపు తెచ్చుకున్నారు. బాల సరస్వతిదేవి తెలుగు చిత్ర పరిశ్రమ తొలిదశలో అనేక మధుర గీతాలు ఆలపించారు. ఆమె మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.