02-05-2025 12:00:00 AM
వైరా, మే 1 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా వైరా అసెంబ్లీ శాసనసభ్యులు మాలో తు రాందాస్ నాయక్ చిన్న కుమార్తె మాలో త్ వందన గురువారం ఎంబిబిఎస్ డిగ్రీ ప ట్టా అందుకున్నారు.. కడప జిల్లాలోని ఫాతి మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్స్ కాలేజీలో మాబ్స్ పూర్తి చేసి తన కుమార్తె పట్టా అందుకుంటున్న సందర్భంగా వైరా ఎమ్మెల్యే ఆ కార్యక్రమానికి హాజరయ్యారు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎం బిబిఎస్ పట్టా అందుకోవటం ఎంతో ఆనం దంగా ఉందన్నారు.. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఏకైక లక్ష్యంతో పేద ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిం చే సదుద్దేశంతోనే తన ముగ్గురి సంతానం లో ఇద్దరూ కుమార్తెలను డాక్టర్ వృత్తికి అం కితం చేశానన్నారు.. తన కుమారుడిని ఇంజనీరింగ్ చదివించడం జరిగిందన్నారు..
తన పెద్ద కుమార్తె మాలోతు గాయత్రి ఆ యుర్వేదిక్ వైద్యంలో గాడ్యుయేషన్ పూర్తి చేయగా, మరో కుమార్తె చందన కూడా డా క్టర్ పట్టా పొందిందన్నారు. కుమారుడు మాలోత్ విగ్నేష్ బీటెక్ పూర్తి చేసినట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. వారిని విద్యావంతులను చేయటంలో తన సతీమణి మాలోతు లలిత ఎంతో కృషి చేసిందన్నా రు.
తాను రాజకీయాల్లో క్షణం తీరిక లేకుం డా ఉన్నప్పటికీ పిల్లల భవిష్యత్తును తీర్చిది ద్దంలో ఆమె ఎంతో ప్రణాళిక బద్ధంగా వ్యవ హరించారని సతీమణి కృషిని అభినందిం చారు. తనతో పాటు తన పిల్లలు కూడా వైరా నియోజకవర్గ ప్రజల కు సేవలు అం దించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా లోనే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు.