20-09-2025 12:00:00 AM
కుబీర్ సెప్టెంబర్ 19: కుబీర్ మండల కేంద్రంలో గురువారం రాత్రి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ నారాయణ మరో పోలీస్ అధికారిపై కత్తితో దాడి చేసిన అబ్దుల్ కలీం ను అరెస్టు చేసినట్టు బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించారు. కుబీర్ కి చెందిన అబ్దుల్ కలీం భార్యతో గొడవ పడి పోలీస్ స్టేషన్ కు రాత్రి 11 గంటలకు వచ్చారన్నారు.
మద్యం మత్తులో ఉన్న ఆయనను అక్కడ ఉన్న హెడ్ కానిస్టేబుల్ నారాయణ అడుక్కోగా కత్తితో దాడి పరారయ్యారున్నారు ఆయనను బైంసాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నట్లు తెలిపారు కత్తితో దాడి చేసిన నిందితుని గురువారం పట్టుకొని అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో సీఐ నైలు ఎస్సు కృష్ణారెడ్డి పోలీస్ సిబ్బంది ఉన్నారు