calender_icon.png 1 August, 2025 | 6:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ

31-07-2025 09:59:05 PM

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): జిల్లా వైద్య  ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ రజిత రాజన్న సిరిసిల్ల జిల్లాలో  చెందుర్తి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ నిర్వహించినారు. ఈ తనిఖీలలో రికార్డులను, మందుల నిల్వలను పరిశీలించి, వర్షాకాలంలో ప్రబలే డెంగ్యూ జ్వరాల నియంత్రణ (డ్రై డే) కార్యక్రమమును ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సాధారణ ప్రసవాలు జరిగేటట్లు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారికి సూచించినారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంపత్ కుమార్, సి హెచ్ ఓ శశికళ, సూపర్వైజర్లు పాల్గొన్నారు.