calender_icon.png 7 August, 2025 | 5:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసభ్యకర పోస్టు చేసిన వ్యక్తి అరెస్ట్

06-08-2025 11:16:06 PM

మంచిర్యాల (విజయక్రాంతి): నస్పూర్‌ పోలీస్ స్టేషన్(Naspur Police Station) పరిధిలో చిన్నారుల అసభ్యకర వీడియోలు పోస్ట్ చేసిన కేసులో వ్యక్తి అరెస్ట్ చేసినట్లు మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్ తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చిన్నారుల అసభ్యకరమైన వీడియోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కేసులో నస్పూర్ మండలానికి చెందిన కర్రు సందీప్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశామన్నారు.

ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లెయిటెడ్ చిల్డ్రన్ (ఎన్సీఎంఈ) సంస్థ గుర్తించి, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ విభాగానికి సమాచారం అందించిందనీ, సైబర్ సెక్యూరిటీ వింగ్ అందించిన సమాచారంపై స్పందించి సైబర్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. విచారణలో సరైన ఆధారాలు సేకరించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. 

సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు చేస్తే చర్యలు తప్పవు..

సోషల్ మీడియా, ఇంటర్నెట్‌ లలో చిన్నారుల అసభ్యకరమైన విషయాలపై వెతకడం, వాటిని షేర్ చేయడం, ఫార్వర్డ్ చేయడం, ప్రచారం చేయడం లాంటివి అత్యంత తీవ్ర నేరాలనీ మంచిర్యాల రూరల్ సిఐ ఆకుల అశోక్ తెలిపారు. ఇటువంటి చర్యలు చేసిన ప్రతి ఒక్కరిపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ వింగ్ కఠినంగా స్పందించి, చట్టరీత్యా చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, అసభ్యకరమైన విషయాలను దూరంగా ఉంచాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో నస్పూర్ యూ. ఉపేందర్ రావు పాల్గొన్నారు.