25-10-2025 08:28:37 PM
పది కిలోల ఎండు గంజాయి స్వాధీనం
పటాన్ చెరు: అక్రమంగా పది కిలోల ఎండు గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్ర రాష్ట్రం ఉస్మానాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి ఒడిస్సా రాష్ట్రం నుండి 10 కిలోల ఎండు గంజాయిని తన సంచిలో రహస్యంగా తరలిస్తున్నాడనే నమ్మదగిన సమాచారం మేరకు ముత్తంగి గ్రామ శివారులోని ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 3 దగ్గర పట్టుకున్నట్లు ఎస్ఐ ఎన్.రాజు తెలిపారు. ఆ వ్యక్తిని పట్టుకొని విచారించగా తన పేరు సంతోష్ మధుకర్ చవాన్ అని, ఒరిస్సా రాష్ట్రానికి చెందిన సురేష్ బేహార అనే వ్యక్తి ఎండు గంజాయిని తక్కువ ధరకు తీసుకొని ఎక్కువ ధరకు అమ్ముకొని డబ్బులు సంపాదించవచ్చనే ఉద్దేశ్యంతో తీసుకువచ్చినట్లు తెలిపారు. ఆ వ్యక్తి వద్ద 10 కేజీల ఎండు గంజాయిని, ఒక సెల్ ఫోన్ ను స్వాదీన పర్చుకొని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.