calender_icon.png 25 October, 2025 | 11:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేన్ రక్షిత ప్రాంతాన్ని సందర్శించుకున్న వాగ్దేవి విద్యార్థులు

25-10-2025 08:30:00 PM

హనుమకొండ,(విజయక్రాంతి): హనుమకొండ వాగ్దేవి డిగ్రీ & పిజి కళాశాల వృక్షశాస్త్ర విభాగ విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా పాలంపేట గ్రామ శివారులోని కేన్ రక్షిత ప్రాంతాన్ని సందర్శించి, సమగ్ర అధ్యయనం గావించారు. ఈ సందర్బంగా కేన్ మాన్ అఫ్ తెలంగాణ డా. సుతారి సతీష్ విద్యార్థులకు కేన్ మొక్కల ప్రాముఖ్యత, కేన్ ప్రాంతం ఏ రకంగా జీవవైవిధ్యం తో కూడి వున్నది, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని ఈ మొక్కల ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన ప్రాశస్త్యాన్ని విద్యార్థులకు వివరించారు.

అదేవిధంగా విద్యార్థులు రామప్ప ఆలయం, సరస్సులను సందర్శించారు. ఆలయ గైడ్ విజయ్ రామప్ప ఆలయ విశిష్టత, కాకతీయుల శిల్ప కళా నైపుణ్యం, గొలుసు కట్టు చెరువుల గూర్చి విద్యార్థులకు వివరించారు. అనంతరం ఏటూరునాగారం అభయారణ్యం, బ్లాక్బెర్రీ ఐలాండ్ లను సందర్చించి, దేశీయ మొక్కలు, జీవావరణంలో అడవుల పాత్ర, జీవవైవిధ్యత, ఔషధ మొక్కలు, గిరిజన జాతులు స్థానిక మొక్కలను  వివిధ రోగాలను నయం చేయడానికి వాడే విధానం, వంటి విషయాలపై అవగాహన విద్యార్థులకు డా. సతీష్ అవగాహన కల్పించారు.