calender_icon.png 4 August, 2025 | 8:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వలిగొండ గుట్టను వక్ఫ్ బోర్డ్ కు కేటాయించవద్దని కలెక్టర్ కు వినతి పత్రం

04-08-2025 06:10:09 PM

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ గుట్టను వక్ఫ్ బోర్డ్ కు కేటాయించవద్దని సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు(District Collector Hanumantha Rao)కు, వలిగొండ తహసిల్దార్ దశరథకు హిందూ సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రాలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వలిగొండ గుట్ట అత్యంత పురాతనమైన శివాలయం ఉన్న ప్రాంతమని గుట్టపై శివాలయానికి సంబంధించిన శివలింగం, పురాతన శివాలయం మండపం, పాదముద్రలు, కొలను ఉన్నాయని అన్నారు. కాలక్రమంలో శివాలయాన్ని పట్టించుకోకపోవడంతో శిథిలమైందని గత కొన్ని సంవత్సరాల క్రితం తిరిగి శివాలయాన్ని పునరుద్ధరించడం జరిగిందని అత్యంత పురాతనమైన శివాలయం కలిగి ఉన్న వలిగొండ గుట్టను వక్ఫ్ బోర్డ్ కు కేటాయించే వద్దని సరైన ఆధారాలను పరిశీలించాలని కోరారు.