calender_icon.png 6 August, 2025 | 12:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

05-08-2025 12:00:00 AM

ఎల్లారెడ్డి ఆగస్టు 4 (విజయ క్రాంతి): పురుగుల మందు సేవించి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన, ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట మండలం అయ్యపల్లి, గ్రామంలో చోటు చేసుకుంది. లింగంపేట్ ఇన్ఛార్జి ఎస్సై భార్గవ్గౌడ్  తెలిపిన వివరాల ప్రకారం, అయ్యపల్లి తండాలో మూడు రోజుల క్రితం మేకల చోరీ జరిగింది. ఈ ఘటనలో కేసు నమోదు కాగా, చల్ల మహేశ్, కాంట్రపల్లి ప్రవీవ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే ఈ కేసులో ప్రధాన నిందితులతో పాటు మరో ఇద్దరు కూడా మేకల చోరీకి పాల్పడ్డట్లుగా ఓ పత్రికలో కథనం ప్రచురితమైంది. దీంతో సంబంధం లేని కేసులో తన పేరు రాసినందుకు అవమానంగా భావించిన అయ్యపల్లి గ్రామానికి చెందిన చిలుక లక్ష్మీనారాయణ (40) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాట్లు, స్థానికులు తెలిపారు.