calender_icon.png 5 August, 2025 | 10:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోరాటం తప్ప మరో మార్గం లేదు

05-08-2025 12:00:00 AM

  1. అధికార పక్షానికి చిత్తశుద్ధి లేదు.. ప్రతిపక్షాలకు పట్టింపు లేదు

పెన్షన్‌దారుల సమస్యలపై 13న మహాగర్జన...

ఆదిలాబాద్ సన్నాక సమావేశంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ

ఆదిలాబాద్, ఆగస్టు ౪ (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే చేయూత, ఆసరా పెన్షన్ల ను పెంచుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి స్వ యంగా ప్రకటన చేశారాని, అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచిన హామీని నెరవేర్చ డం లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆరోపిం చారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన వికలాంగులు,

చేయూత పెన్ష న్ దారుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ...  వికలాంగుల పెన్షన్లు రూ. 6000కు పెంచాలని, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఇతర చేయుత పెన్షన్ దారుల పెన్షన్ లన్ని రూ.4,000 పెంచాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 13న హైదరాబాద్‌లో జరగబోయే మహాగర్జన విజయవంతనికై నేడు ఆదిలాబాద్ జిల్లా లో పెన్షన్ దారుల సన్నాహక మహాసభను నిర్వహించమన్నారు.

పెన్షన్ల పెంపు గురించి అధికార పార్టీకి చిత్తశుద్ధి లేదని, ప్రతిపక్షాలకు పట్టింపు లేదని విమర్శించారు. పోరాటం తప్ప మరో మార్గం లేదని తెలియజేశారు. ఆగస్టు 13న పెన్షన్ల పెంపు కోసం జరుగుతున్న మహా గర్జనకు పెద్ద ఎత్తున హైదరాబాద్ కు తరలిరావాలని పిలుపునిచ్చారు.

ఈ సభలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆరెల్లి మల్లేష్ మాదిగ, విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు కన్నేపల్లి ప్రేమ్‌రాజ్, సీనియర్ నాయకుడు మహబూబ్, కనక కిషన్, షేక్ మైబూబ్ నివర్తి, నాందేవ్, సంతోష్, సురేఖ, దుర్వ, హరూమాన్ బి, షేక్ మైనుద్దీన్, అనసూయ,  ఎమ్మార్పీఎస్, ఆసర చేయూత పెన్షన్ దారుల కమిటీలు పాల్గొన్నారు.