calender_icon.png 7 August, 2025 | 5:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇద్దరికి మూడేళ్ల చొప్పున కఠిన కారాగార శిక్ష

05-08-2025 12:00:00 AM

నిజామాబాద్ లీగల్ కరస్పాండెంట్ ఆగస్టు 4: (విజయ క్రాంతి): ముగ్గురిని కులం పేరుతో దూశించి అవమాన పరిచి, కట్టేతో కొట్టి గాయపరచి, తీవ్రంగా గాయపరచిన కేసులో మొగులపు సాయి కృష్ణ, మొగులపు రవిచంద్ర లకు ఇండియన్ పినల్ కోడ్ లోని నాలుగు సెక్షన్స్ లకు గాను ఆరు నెలలు, సంవత్సరం, మూడేళ్లు, ఆరు నెలల చొప్పున, షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల పై అత్యాచారాల నిరోధక చట్టం ప్రకారం ఆరు నెలల జైలుశిక్షలు విదిస్తూ నిజామాబాద్ షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల పై అత్యాచారాల విచారణ న్యాయస్థానం స్పెషల్ జడ్జి టి. శ్రీనివాస్ సోమవారం తీర్పు చెప్పారు.

వివరాలు నవీపేట్ మండలం సలీమ్ ఫామ్ మోకన్ పల్లి గ్రామానికి చెందిన రవిచంద్ర గ్రామంలోని దళిత వాడలోని రోడ్డు పక్కన ఉన్న బండరాయిని జెసిబి తో తొలగించడంతో పెద్ద గోతి ఏర్పడింది. దీని మూలంగా దారి వెంట నడవడం కష్ట మైతుందని అక్కడి నివాసులైన మాదిరి శారద, బోడికే చిన్నయ్య, బోడికే దేవయ్య లు సాయికృష్ణ, రవిచంద్ర లకు తెలిపారు.

వారు ఎంతకు బొందను కూడువక పోవడంతో రోడ్డుపై ఏర్పడిన బొందకు అడ్డంగా చిన్నయ్య కంపను వేశాడు.నడుస్తే నడవండి లేకుంటే లేదు అంటూ మీకు సక్కని రోడ్డు కావాల్నా అంటూ శారద, చిన్నయ్య, దేవయ్య లను కులం పేరుతో దూశించి, బహిరంగ ప్రదేశంలో అవమానించారు.కట్టేతో కొట్టి గాయపరిచారు, మరొకరిని తీవ్రంగా గాయపరిచారు.చంపి వేస్తామని బెదిరింపులు చేశారు.

22 జులై, 2020 న నేరాలు జరిగినట్లు ప్రాసిక్యూషన్ వివరించింది.సదరు నేరారోపణలు న్యాయస్థానపు నేర న్యాయ విచారణలో రుజువు అయినట్లు ప్రకటిస్తు స్పెషల్ జడ్జి టి. శ్రీనివాస్ ముద్దాయిలిద్దరికి ఇండియన్ పినల్ కోడ్ సెక్షన్స్ 323 (గాయ పరచడం )ఆరు నెలలు, సెక్షన్ 324(ఆయుధంతో గాయపరచడం )ఒక సంవత్సరం,సెక్షన్ 326(ఆయుధంతో తీవ్రంగా గాయపరచడం )మూడు సంవత్సరాలు సెక్షన్ 506(నేరపూరిత బెదిరింపులు )గాను ఆరు నెలలు జైలుశిక్షలు విధించారు.

షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలపై అత్యాచారాల నిరోధక చట్ట ప్రకారం ఆరు నెలల జైలుశిక్ష ఖరారు చేశారు. శిక్షలన్ని ఏకకాలంలో  అనుభవించాలని జడ్జి శ్రీనివాస్ తమ తీర్పులో పేర్కొన్నారు.పోలీసుల తరపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బంటు వసంత్ ప్రాసిక్యూషన్ నిర్వహించారు.