17-11-2025 12:00:00 AM
కామారెడ్డి, నవంబర్ 16 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో నరుప రెండు శాతం రిజర్వేషన్లు ధ్యేయంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం రన్ ఫర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రామారెడ్డి చౌరస్తా నుండి కుమార్తె కాలనీ వరకు బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు సాధించడమే ధ్యేయంగా బిసి జేఏసీ ఆధ్వ ర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.
రిజ ర్వేషన్లు ఎవరు ఇచ్చే బిక్ష కాదు రాజ్యాంగ పరంగా ఇది మా హక్కు అని, 42 శాతం రిజర్వేషన్లు చట్టపరంగా తొమ్మిదవ షెడ్యూ ల్లో చేర్చాలని రాజ్యాంగ సవరణ చేసి న్యాయపరంగా బీసీలకు హక్కులు ఇవ్వాలని బిసి జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. 60 శాతం ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చి కూడా ఓరవలేక స్వార్థపూరిత అగ్రవర్ణ నాయకుల కుట్రలన్ని భగ్నం చేస్తామన్నారు.
అగ్రవర్ణాలకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని హెచ్చరించారు. పార్లమెంటు శీతా కాల సమావేశాల్లో బీసీల బిల్లు పెట్టి ఆమో దం తెలపాలని లేనియెడల లక్షలాది మం దితో పార్లమెంట్ ముట్టడి చేపడతా మని హెచ్చరించారు. అనంతరం నిజాం సాగర్ చౌరస్తాలో దీక్ష చేపట్టారు. ఈ కార్యక్ర మంలో బిసి జేఏసీ నాయకులు నీళ్ల నాగ రాజు, సాప శివరాములు, కుంభాల లక్ష్మణ్ యాదవ్, చింతల శంకర్, రాజేందర్, సుద ర్శన్, ప్రశాంత్, రవి, కృష్ణ, ప్రభంజన్, విక్రమ్, అరవింద్, ప్రమోద్, స్వామి, కిరణ్, వినోద్, శ్రీధర్, సాయి పాల్గొన్నారు.