24-05-2025 12:20:22 AM
వెంటనే స్పందించి ప్రాణాలు కాపాడిన అర్వపల్లి పోలీసులు
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్థాపానికి గురై వ్యక్తి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిన సంఘటన శుక్రవారం మండలంలో చోటుచేసుకుంది. బంధువులు, అర్వపల్లి ఎస్సై బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని అడివెంల గ్రామానికి చెందిన రాపర్తి హరీష్ కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నానని శుక్రవారం సాయంత్రం సమీప బంధువులకు వీడియో కాల్ చేసి చనిపోతున్నానని తెలిపాడు. వెంటనే బంధువులు డయల్ 100కు సమాచారం ఇచ్చారు.దీనిపై స్పందించిన ఎస్సై తన సిబ్బందితో వెళ్లి ఫోన్ నెట్వర్క్ లొకేషన్ ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తించి ప్రాణాలతో రక్షించాడు. అనంతరం కౌన్సిలింగ్ చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. త్వరితగతిన స్పందించి వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసులను గ్రామస్తులు అభినందించి,హర్షం వ్యక్తం చేశారు.