24-05-2025 12:20:56 AM
యాదాద్రి భువనగిరి మే 23 ( విజయ క్రాంతి ) : గ్రామ పాలన అధికారి పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పాలన అధికారి రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు.
భువనగిరి పట్టణంలోని రేణుక ఎల్లమ్మ దేవాలయం వెనక ఉన్న వెన్నెల కళాశాలలో ఏర్పాట్లు చేసిన్నట్లు పరీక్ష ఈ నెల 25న(ఆదివారం ) రోజున నిర్వహించనున్న పరీక్షకు 151 మంది హాజరుకానున్నారని తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష వ్రాసే వారు పరీక్ష కేంద్రాలకు అర్ధగంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ తెలిపారు.