24-05-2025 12:18:37 AM
మఠంపల్లి మే 23: మఠంపల్లి మండలంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం, మట్టపల్లి మహాక్షేత్రం నందు శుక్రవారం శ్రీ స్వామి వారికి నిత్య కళ్యాణం దేవాలయ అర్చకులు తూమాటి శ్రీనివాసాచార్యులు , పద్మనాభా చార్యులు, లక్ష్మీనరసింహ మూర్తి వార్లచే శాస్త్రోతముగా నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో కళ్యాణంలో దేవస్థాన అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లి రావు, విజయ్ కుమార్, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.