13-07-2025 07:10:07 PM
రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్..
దళితరత్న అవార్డు గ్రహీత నెమలి నర్సయ్య మాదిగ..
ములుగు వెంకటపూర్ (విజయక్రాంతి): కండరాల క్షీణత, రక్తహీనత వ్యాధిగ్రస్తులకు పెన్షన్ ఇవ్వాలని దళితరత్న అవార్డు గ్రహీత నెమలి నర్సయ్య మాదిగ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. లేని పక్షంలో వచ్చే ఆగస్టు మాసంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(MRPS Founding President Manda Krishna Madiga) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తారని అన్నారు. భారత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతయుతంగా వ్యవహరించాలని హితవు, పద్మశ్రీ అవార్డు గ్రహీత భారతదేశ పీడిత వర్గాల దిక్చూచి మాన్యులు మందకృష్ణ మాదిగన్న ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ ములుగు జిల్లా ఇన్చార్జ్ చాతాల్ల రమేష్ విజయన్న మాదిగ సూచనల మేరకు ములుగు జిల్లా వెంకటాపూర్(రామప్ప) మండలం నల్లకుంట గ్రామంలోని వెలిసోజు ప్రేమ్ సాగర్ గత నాలుగు నెలలుగా రక్తహీనత కండరాల క్షీణతతో బాధపడుతూ మంచానికే పరిమితం బాధాకరమని ఎమ్మార్పీఎస్ జాతీయ నేత దళిత రత్న అవార్డు గ్రహీత నెమలి నర్సయ్యమాదిగ బాధాకరం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆ కుటుంబాన్ని పరామర్శించి నెమలి నర్సయ్య మాదిగ మాట్లాడుతూ... ఈ దేశంలో ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో అన్ని కులాలలో మతాలలో ఉన్నటువంటి వికలాంగులకు పెన్షన్ హెచ్చింపు పోరాటం చేసి నేడు నాలుగువేల రూపాయలు పొందుతూన్న వికలాంగులకు పెన్షన్ హెచ్చింపు పై భారత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద వికలాంగులతో యుద్ధానికి సిద్ధం చేస్తున్న వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగన్న ఆవేదన అనుసరించి నేడు నల్లకుంట గ్రామంలో అత్యంత పేదరికంలో కడు వడ్రంగి కుటుంబంలో జన్మించిన ప్రేమ్ సాగర్ కుటుంబాన్ని అన్ని రాజకీయ పార్టీల మేధావులు సందర్శించి ఆర్థికంగా సహకరిస్తూనే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధితో పాటు, ప్రతి నెల పెన్షన్ అందించే విధంగా ఆ కుటుంబానికి అండగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వచ్చే నెల ఆగస్టు మాసంలో జరగబోవు రక్తహీనత కండరాల క్షీణత, వ్యాధిగస్థులకు లకు పెన్షన్ తో వికలాంగులకు పెన్షన్ హెచ్చింపు పై జరగబోవు యుద్ధంలో తెలంగాణలో అన్ని వర్గాల మహాజన బిడ్డలైన పేదలు పాల్గొనాలని పిలుపునిచ్చారు