13-07-2025 07:01:24 PM
రాజంపేట (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) రాజంపేట మండల కేంద్రంలోని న్యూ బీసీ కాలనీలో ఆదివారం మైసమ్మకు, ఎల్లమ్మకు బోనాల ఉత్సవాలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో నిర్వహించే ఉత్సవ కార్యక్రమాలలో భాగంగా ఈ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. కాలనీలోని ప్రతి ఇంటి నుంచి అమ్మవార్లకు బోనాలు సమర్పించి నైవేద్యాన్ని సమర్పించారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఉత్సవాలను పెద్ద ఎత్తున పాల్గొని సంబరాలు అంబరాన్ని అంటే విధంగా జరిపారు. ఈ సంవత్సరం పిల్ల పాపలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అలాగే పాడి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు కార్యదర్శి కుంటోళ్ళ యాదయ్య, సుతారి లక్ష్మి, బెస్త రాజనరసింహులు, గుర్రాల నారాయణ, బండారి సాయిలు, జలగడుగుల నర్సింలు, సాగర్, తోడంగల కృష్ణతో పాటు కాలనీ పెద్దలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.