13-07-2025 07:04:54 PM
కలిసి ఉందాం గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించుకుందాం..
మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు..
ఏటూరునాగారం (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) ఏటూరునాగారం మండలంలోని ఎక్కల గ్రామస్థులతో సమావేశంలో గ్రామ సమస్యలను కాంగ్రెస్ మండల పార్టీ నాయకులు గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామస్తుల ముందే సంబంధిత అధికారులతో మాట్లాడారు. సమస్యలను పై ఉన్నతాధికారులకు కూడా తెలియజేసి వెంటనే పరిష్కరిస్తామని అన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు చిటమట రఘు మాట్లాడుతూ... ప్రజల వెంటే కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఏ సమస్య అయినా మాకు పోన్ ద్వారా తెలియజేస్తే వెంటనే స్పందిస్తామని మంత్రి సీతక్క సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని, పండగ అయిన పాప్బం అయినా మంచి అయినా చెడు అయినా తెలియజేయాలని అందులో కాంగ్రెస్ పార్టీ భాగస్వాములు అవుతారని అప్పుడే ప్రజలకు, నాయకులకు మధ్య సంబంధాలు ఏర్పడి గ్రామాల అభివృద్ధికి దోహదపడతాయని అన్నారు.