calender_icon.png 22 November, 2025 | 1:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

10-02-2025 12:00:00 AM

రాత్రంతా వాహనాలు వెళ్లడంతో నుజ్జయిన శవం

మెదక్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): మెదక్ పట్టణ శివారులో ఆదివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని సుమారుగా 50 మీటర్లు లాకెళ్లినట్లు గుర్తించారు.

చీకటిగా ఉండడంతో అటుగా వెళుతున్న వాహనదారులు శవాన్ని గుర్తించక వ్యక్తి పైనుంచి వాహనాలు వెళ్లడంతో డెడ్బాడీ నుజ్జునుజ్జు గా గుర్తుపట్టని స్థితిలో ఉంది. మృత దేహాన్ని మెదక్ పట్టణం పతేనగర్ కు చెందిన అబ్దుల్ రహీం గా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న హవేలీ ఘనపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రహదారి వెంట సీసీ కెమెరాల ఆధారంగా వాహనం పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. మృతదేహం ముక్కలు ముక్కలుగా పడి  వుండడంతో పోస్టుమార్టం చేయడానికి వీలుకాక పోవడంతో ఘటన స్థలంలోనే శవ పంచానామ నిర్వహించినట్లు ఎస్త్స్ర సత్యనారాయణ తెలిపారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుతెలిపారు.