25-04-2025 02:22:12 PM
ఓకే మండపంలో ఇద్దరితో పెళ్లి
గతంలోనూ యువకుడు ఇద్దరు యువతలను పెళ్ళాడాడు
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): మూడుముళ్ల బంధంతో పెళ్లి తంతు జరగాల్సి ఉండగా ఒక యువకుడు ఆరు ముళ్ళు వేశాడు. జిల్లాలోని జైనూరు మండలం అడ్డెసార గ్రామానికి చెందిన ఆత్రం ఛత్రు షాన్ ఇద్దరి యువతులతో ప్రేమాయణం కొనసాగించాడు. ట్రయాంగిల్ ప్రేమ వ్యవహారం సదరు యువతులకు తెలవడంతో ఇద్దరు యువతులు ఆ యువకుడినే పెళ్లి చేసుకునేందుకు పట్టుపట్టారు.
ఈ విషయం ఇంటి పెద్దలకు తెలవడంతో చేసేది ఏమీ లేక కుటుంబ సభ్యులను ఒప్పించి ఆ ముగ్గురు ఒకటయ్యారు. వివాహ ఆహ్వాన పత్రికలోనూ వరుడుతోపాటు ఇద్దరి యువతుల ఫోటోలను ముద్రించి బంధుమిత్రులను ఆహ్వానించారు. బంధువుల సమక్షంలో గురువారం(24) న రాత్రి అంగరంగ వైభవంగా సాంప్రదాయ పద్ధతిలో జంగుబాయి, సోన్ దేవి లను ఛత్రుషాన్ వివాహం చేసుకున్నాడు.
వివాహ తంతు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. మార్చి 28న లింగాపూర్ మండలం గుమ్నుర్ గ్రామంలో గిరిజన యువకుడు సూర్యదేవ్ సిర్పూర్ మండలానికి చెందిన ఆత్రం జల్కర్ దేవి, లాల్ దేవి తొప్రేమ వ్యవహారం సాగించారు. ఇద్దరి యువతులకు విషయం తెలియడంతో ఇరువురిని నచ్చజెప్పి కుటుంబ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న సంఘటన నెలకొంది.