18 April, 2026 | 3:27 AM

మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి జైలు శిక్ష

13-05-2025 12:24 AM

మహబూబ్ నగర్ మే 12 (విజయ క్రాంతి) : మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి 5 రోజుల జైలు శిక్ష పడినట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ భగవంతు రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ భగవంత్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది తో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు.

ఈ ప్రత్యేక డ్రైవ్లో పట్టుబడిన నలుగురు వ్యక్తులపై గౌరవనీయులైన 2వ JFCM కోర్టు జడ్జి శ్ ఆర్. శశిధర్  విచారించి, ఒక వ్యక్తికి 5 రోజుల జైలు శిక్ష విధిం చగా, ఇంకొకరికి రూ.2000/- జరిమానా, మిగతా ఇద్దరికి తలసరి రూ.1000/- చొప్పు న నగదు జరిమానా విధించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ భగవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, డ్రంకెన్ డ్రైవింగ్ వల్ల రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి.

ప్రజల ప్రాణాలను రక్షించడం మా ప్రధాన లక్ష్యం. మద్యం సేవించి వాహనం నడిపే వారు తమకే కాకుండా ఇతరుల జీవితాలను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తురన్నారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి. మేము ఇలాంటి చెక్లు ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపే వారు తగిన శిక్షలకు గురవుతారని హెచ్చరిస్తున్నామని తెలిపారు.