calender_icon.png 13 May, 2025 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసులో పురోగతి ఉండాలి

13-05-2025 12:23:10 AM

  • ప్రజల న్యాయాని ప్రత్యేక చర్యలు తీసుకోవాలి

జిల్లా ఎస్పీ డి జానకి 

మహబూబ్ నగర్ మే 12 (విజయ క్రాంతి) : కేసులో పురోగతి ఉండాలని జిల్లా ఎస్పీ డి జానకి అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహిం చిన ఫిర్యాదుల శేఖర్ కార్యక్రమానికి ప్రజలు భారీ ఎత్తున చేరుకున్నారు ఈ సందర్భంగా 14 ఫిర్యాదులు అందించారు.

ఈమెకు ఎస్పి  మాట్లాడుతూ గ్రీవెన్స్ డేలో 14 ఫిర్యాదులు స్వీకరణ - ఎస్పీ శ్రీమతి డి. జానకి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించబడుతున్నని జిల్లా  డి. జానకి తెలిపారు.ప్రజలకు పోలీస్ సేవలు మరింత చే రువ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుతో అ ధికారులు మర్యాదపూర్వకంగా ప్రవర్తించి, వారి వినతులను గౌరవంతో స్వీకరించాలని సూచించారు.

అవసరమైతే, క్షేత్ర స్థాయిలో పరిశీలించి చట్టపరంగా న్యాయం జరగేలా చూడాలని ఆమె తెలిపారు. గ్రీవెన్స్ డేలో వచ్చిన ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేసి, పరిష్కార స్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడం జరుగుతోందని చెప్పారు. ఇలా చేయడం వల్ల ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా, తక్షణమే స్పందన లభించేలా చర్యలు తీసుకుంటుమన్నారు.