08-06-2025 08:45:11 PM
మందమర్రి (విజయక్రాంతి): రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో నూతన రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి(MLA Vivek Venkataswamy)ని మండల కాంగ్రెస్ నాయకులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం హైదరాబాదులో నూతన మంత్రిని కలిసి అభినందనలు తెలిపి పుష్పగుచ్ఛం అందచేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గందె రాంచందర్, మండల పార్టీ అధ్యక్షులు బానోత్ నీలయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు ఆకుల అంజి, మాజీ ఎంపిటిసి దుర్గం కుమార్, దుర్గం సుధాకర్ లు పాల్గొన్నారు.