calender_icon.png 9 June, 2025 | 1:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాలేదని మనస్థాపనతో ఓ కాంగ్రెస్ నాయకుడు రాజీనామా

08-06-2025 08:41:54 PM

చండూరు (విజయక్రాంతి): మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy)కి మంత్రి పదవి రాలేదని మనస్థాపంతో ధోని పాముల గ్రామానికి చెందిన మాజీ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తిప్పర్తి పాండు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే మీలాంటి నాయకులు కాంగ్రెస్ పార్టీకి అవసరమని, మంత్రి పదవి ఇస్తామని నచ్చజెప్పి పార్టీలో చేర్చుకుని ఇప్పుడు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

భువనగిరి పార్లమెంటు అభ్యర్థి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన మా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వరని ఆయన ప్రశ్నించారు. భువనగిరి పార్లమెంటు ఎన్నికలలో ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని ఆరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ చెప్పిందని ఆయన అన్నారు. మా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాడని ఆయన అన్నారు.