calender_icon.png 15 December, 2025 | 4:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దాడులు, దౌర్జన్యాలు!

15-12-2025 01:36:09 AM

  1. ఇవే కాంగ్రెస్ నాయకుల మార్గాలు 
  2. మేము తిరగబడితే తట్టుకోలేరు 
  3. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష 
  4. తుంగతుర్తిలో కాంగ్రెస్ అధికార దుర్వినియోగం 
  5. ఉప్పల మల్లయ్య కుటుంబానికి అండగా ఉంటాం.. రూ.5 లక్షల ఆర్థిక సాయం 
  6. బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగం: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

సూర్యాపేట, డిసెంబర్ 14 (విజయక్రాంతి): దాడులు, దౌర్జన్యాలు, అరాచకా లు.. ఇవే కాంగ్రెస్ నాయకుల మార్గాలు అని, కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సూర్యాపేట జిల్లా లోని నూతనకల్  మండలం లింగంపల్లి గ్రామంలో ఇటీవల బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన గొడవలో మృతి చెందిన మల్లయ్య కుటుంబాన్ని ఆదివా రం పరామర్శించారు.

మల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, ఆయన కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లయ్య కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ కేవలం సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమి భయంతోనే దాడులకు పాల్పడుతుందన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో తుంగతుర్తిలో శాంతి వెల్లివిరిసింద న్నారు.

ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడు తూ దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలు చేస్తున్నారని మండిపడ్డారు. లింగంపల్లిలో తమ కార్యకర్త మల్లయ్యను హత్య చేయడం, ఎల్లమ్మగూడెం గ్రామంలో తమ సర్పంచ్ అభ్యర్థి భర్తను కిడ్నాప్ చేయడం, అతని చేత మూత్రం తాగించడం, నకేరేకల్‌లో ఓట్లు గల్లంతు, ఉత్తమ్ ఏరియాలో అరాచకాలు ఇవన్నీ వారి దౌర్జన్యకాండకు నిదర్శనం అన్నారు.

తాము మేము అధికారంలో వున్నప్పుడు అందరిని గౌరవించామని, ఎక్కడా దాడులు చేయలేదన్నారు. రెండేళ్లలో అద్భుతాలు చేశామని, రుణమాఫీ, ఇళ్లు, రేషన్ కార్డులు ఇచ్చామని కాంగ్రెస్ చెబుతున్న మాటలు నిజమే అయితే, ఎన్నికలంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఇచ్చిన 420 హామీలు అమలు చేసి ఉంటే ప్రజలే బ్రహ్మరథం పట్టేవారని, కానీ వైఫల్యాల భయంతోనే కాంగ్రెస్ నేతలు దాడులకు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారన్నారు.

తాము తిరగబడితే కాంగ్రెస్ నాయకులు తట్టుకోలేరని హెచ్చరించారు. ఎన్ని కుతంత్రాలు చేసినా రాష్ట్రంలో 50 శాతం సర్పంచ్ స్థానాలు బీఆర్‌ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆయనవెంట మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, మల్లయ్య యాదవ్, బూడిద బిక్షమయ్య, భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి, నరసింహ రెడ్డి, గుజ్జ యుగంధర్ రావు, దయాకర్‌రెడ్డి ఉన్నారు.