calender_icon.png 15 December, 2025 | 4:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత

15-12-2025 02:13:07 AM

నాగర్‌కర్నూల్ జిల్లా అవంచలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, దాడులు

నాగర్‌కర్నూల్, డిసెంబర్ 14 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం అవంచ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సర్పంచ్ అభ్యర్థులుగా బరి లో ఉన్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అనుచరులు సౌమ్య, మాజీ ఎమ్మెల్యే మర్రి జనా ర్దన్‌రెడ్డి అనుచరులు చంద్రకళ వర్గాలు ఎదురెదురుపడ్డాయి.

మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అనుచరులైన బీఆర్‌ఎస్ నాయకులు డబ్బు లు పంచుతున్నారని ఆరోపిస్తూ, మాజీ ఎ మ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అనుచరులు అడ్డుకోవడంతో వాగ్వాదం, దాడుల వరకు వెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.