25-10-2025 05:40:03 PM
కన్నాలలో వైద్య శిబిరంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ విజయ భాస్కర్..
మంథని (విజయక్రాంతి): జిల్లాలో పశువులకు గాలికుంటు టీకా తప్పనిసరిగ ఇప్పించాలని, కన్నాలలో నిర్వహించిన పశువైద్య శిబిరంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ విజయ భాస్కర్ అన్నారు. పశువులలో వ్యాధులు ప్రభలుతున్న దృష్ట్యా పక్షం రోజూల పాటు జరుగనున్న 7వ విడత గాలికుంటు వ్యాది నిరోధక టీకాలలో భాగంగా శనివారం కన్నాల గ్రామంలో దాదాపు 69 గోజాతి, 95 గేదేజాతి పశువులకు పశువైద్య సిబ్బంది ఆద్వర్యంలో టీకాలు వేశామని మండల పశు వైద్య అధికారి డాక్టర్ టీ.రవి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షణలో భాగంగా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ విజయ భాస్కర్, మంథని మండల అసిస్టెంట్ డైరెక్టర్, ఇన్‌ఛార్జీ సీనియర్ డాక్టర్ శ్రీదేవి సందర్శించారు.
జిల్లా పశుసంవర్ధక అధికారి మాట్లాడుతూ 6 నెలలు మాత్రమే వ్యాధి నిరోదక గల ఈ టీకాను 6 నేలలు దాటిన అన్నీ గోజాతి (ఆవులు, ఎద్దులు), గేదే జాతి(పెయ్యలు, గేదెలు, దున్నలు) పశువులలో ఈ గాలికుంటు టీకా తప్పనిసరిగ ఇప్పించాలని కోరారు. లేకుంటే పాడి పశువులకు జ్వరం సోకి నీరసించి, నోట్లో పొక్కులు ఏర్పడి, కాలి గిట్టెల నందు పుండ్లు ఏర్పడి నోప్పితో బాధపడును పాల దిగుబడి తగ్గి ఆర్దిక నష్టం వాటిల్లుతుందని, అంతే గాకా సరిగ మెయలేక కొన్నీ సార్లు మృత్యువు వాత ఏర్పడుతుందని, పాడి రైతులు తప్పనిసరిగ ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సహాయ పశువైద్య సిబ్బంధి హన్మండ్లు విఎల్ఓ, అజయ్, శ్రీనివాస్ వ్యాక్సి నేటర్ లు, పాడి రైతులు పాల్గొన్నారు.