25-10-2025 05:42:21 PM
బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షులు భద్రబోయిన సైదులు..
సూర్యాపేట (విజయక్రాంతి): గత రెండు మూడు నెలల నుంచి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రేడియాలజిస్ట్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కావున వెంటనే రేడియాలజిస్ట్ ను నియమించాలని బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షులు భద్ర బోయిన సైదులు అన్నారు. శనివారం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ముందు నిరసన వ్యక్తం చేసి విలేకరులతో మాట్లాడారు. జనరల్ ఆస్పత్రిలో డాక్టర్లు పిస్క్రిప్షన్ షీట్ పై రాసే మందులు ఆస్పత్రిలో అన్ని దొరకడం లేవని ప్రైవేట్ మెడికల్ షాపులను ఆశ్రయించాల్సి వస్తుందన్నారు.
రోగులకు సంబంధించినటువంటి అన్ని మందులను పూర్తిగా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఉచితంగా ఇచ్చే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఉన్నటువంటి అన్ని పీహెచ్ సిలో సరియైన వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్థానిక మంత్రి, జిల్లా కలెక్టర్ నీ కోరుతున్నామని తెలియజేశారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఎమ్మారై స్కానింగ్ లేకపోవడం అనేది చాలా విచిత్రంగా అనిపిస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బైరోజు మదనాచారి, బడుగుల నాగార్జున యాదవ్, మట్టిపల్లి నాగరాజు, ముత్యపు నాగేంద్రబాబు, యోగి, శ్యామ్, నరేష్, అఖిలేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.