25-10-2025 05:34:01 PM
మండపానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి..
మహబూబ్ నగర్ రూరల్: దైవ అనుగ్రహంతోనే సమగ్ర అభివృద్ధి సధ్యమవుతుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మన్యం కొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ఆవరణలో రూ 50 లక్షల ముడా నిధులతో నూతనంగా నిర్మించనున్న కళ్యాణ మండపం నిర్మాణపు పనులకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. అనంతరం కొండపై కొలువైన స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆయన దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అతి పురాతనమైన మన్యం కొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు, మన మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఇటువంటి దేవాలయాలు ఎక్కడ ఉన్నా వాటిని అభివృద్ధి చేసుకుందామని ఆయన చెప్పారు.
తదనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకి వేద ఆశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్ పి వెంకటేష్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, సీనియర్ నాయకులు మారే పల్లి సురేందర్ రెడ్డి, బుద్దారం సుధాకర్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు మైత్రి యాదయ్య, ఖాజా, మల్లు అనిల్ కుమార్ రెడ్డి, అనిల్, జున్ను సురేందర్, గోవింద్ యాదవ్, అలివేలు మంగమ్మ, మన్యం, వేంకటాచారి, కొండ నరేంధర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజు గౌడ్, లక్ష్మారెడ్డి, కురుమూర్తి, రఘు నాయక్, ఆలయ ధర్మకర్త అలహరి మధుసూదన్ కుమార్, ఇఓ శ్రీనివాస్ రాజు తదితరులు పాల్గొన్నారు.