calender_icon.png 20 August, 2025 | 6:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేణుక ఎల్లమ్మ ఆలయంలో మంగళగౌరి వ్రతాలు

20-08-2025 12:00:00 AM

పటాన్ చెరు(జిన్నారం), ఆగస్టు  19 : జిన్నారం మండలం జంగంపేటలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని మంగళవారం మంగళ గౌరీ పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీనివాస భార్గవ ఉదయం పంచామృత అభిషేకం  నిర్వహించారు.

అనంతరం అమ్మవారు మంగళ గౌరీగా దర్శనమిచ్చారు. ఆలయానికి వచ్చిన మహిళా భక్తులు మంగళ గౌరీ వ్రత పూజలు నిర్వహించారు. కుంకుమార్చనలు, లలితా సహస్రనామ పారాయణం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ వెంకటరెడ్డి p పూజ కార్యక్రమాల  ఏర్పాటు చేశారు. జంగంపేట ప్రజలతో పాటు వివిద ప్రాంతాల భక్తులు పాల్గొన్నారు.