calender_icon.png 13 May, 2025 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుల్లూరుబండ లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవం

12-05-2025 12:32:44 AM

సిద్దిపేట, మే 11(విజయక్రాంతి): సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు బండ శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలో ఆదివారం నరసింహ జయంతి ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ప్రహ్లాదుని ప్రార్థన మేరకు శ్రీమన్నారాయణుడు నరసింహ స్వామి రూపంలో ఉగ్ర రూపంలో ఆవిర్భవించి హిరణ్యకశి పున్ని సంహరించినరోజు నరసింహ జయంతిగా నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు.

ఆలయం వంశపారంపర్య అర్చకులు  కలకుంట్ల రంగాచార్య, పొడిచేటి శ్రీనివాసా చార్య, పొడిచేటి రామకృష్ణ, కోయిల్ కాందాలై అచ్యుత్, కలకుంట్ల వెంకట్, కలకుంట్ల నచికేత, సంపన్ ముడుంబై రుత్విక్, సాయి కృష్ణ ల ఆధ్వర్యంలో ఉత్సవం ఘనంగా నిర్వహించారు.

ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ, స్వయాభూ లక్ష్మీ నరసింహ స్వామికి నవకళశ అభిషేకం, సుదర్శన నరసింహ హోమం, శ్రీలక్ష్మీ నరసింహ స్వామి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ వంశపారంపర్య అర్చకులు కలకుంట్ల సుమా రంగాచార్యులు, గ్రామ నాయకులు మాజీ ఉప సర్పంచ్ ప్రసాద్ రెడ్డి, ఉడుత మల్లేశం, కోడూరి శ్రీనివాస్, ఉడుత రవి పాల్గొన్నారు.