27-11-2025 01:06:06 AM
-ఉగ్రవాది ఉమర్‌కు ఆశ్రయం.. పేలుడు పదార్థాలు సరఫరా
-ఈ కేసులో ఏడో ప్రధాన నిందితుడు సోయబ్ : ఎన్‌ఐఏ
న్యూఢిల్లీ, నవంబర్ 26: ఢిల్లీ బాంబు దాడి కేసులో మరో వ్యక్తి అరెస్ట్‌య్యాడు. ఢిల్లీ ఉగ్రవాద పేలుడుకు ముందు ఉగ్రవాది ఉమర్ ఉన్ నబీకి ఆశ్రయం కల్పించడం, ఆయుధాలు సరఫరా చేసినందుకు బుధవారం ఫరీదాబాద్ నివాసిని ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన సోయబ్‌గా గుర్తించిన ఈ నిందితుడు ఈ కేసులో అరెస్టు చేసిన ఏడో ప్రధాన నిందితుడని ఎన్‌ఐఏ తెలిపింది.
నవంబర్ 10న దేశ రాజధానిలోని ఎర్రకోట వెలుపల జరిగిన కార్ బాంబు దాడి కి ముందు సోయబ్ ఉగ్రవాది ఉమర్ ఉన్ నబీకి లాజిస్టికల్ మద్దతు అందించాడని దర్యాప్తులో వెల్లడైందని ఎన్‌ఐఏ పేర్కొంది. పేలుడు వెనుక ఉన్న పూర్తి ఉగ్రవాద కుట్రను ఛేదించే ప్రయత్నాలలో భాగంగా అరెస్టు చేసిన వ్యక్తుల విచారణ కొనసాగుతోందని ఉగ్రవాద నిరోధక సంస్థ తెలిపింది. షోయబ్ అల్ ఫలా యూనివర్సిటీలో కాంపౌండర్‌గా పనిచేశాడని, ఉగ్రకుట్ర గురించి అతడికి ముందే తెలుసని అధికారులు పేర్కొన్నారు.
ఐఈడీ బాంబుల తయారీకి వాడే పేలుడు పదార్థాలను నిందితులు షోయబ్ ఇంట్లోనే నిల్వచేసినట్లు గుర్తిం చామని చెప్పారు. దాడికి కొద్ది సేపటి ముందు డాక్టర్ ఉమర్‌ను తన వదిన ఇంట్లో ఉంచినందుకు షోయబ్‌ను అదుపులోకి తీసుకున్నా మని అధికారులు పేర్కొన్నారు. పేలుడు పదార్థాల తయారీకి అనుమానితులు ఉపయో గించిన గ్రైండర్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. తర్వాత అతడిని ఏడు రోజుల ఎన్‌ఐఏ కస్టడీకి పంపినట్లు తెలిపింది. ఈ దారుణమైన దాడిలో పాల్గొన్న మాడ్యూల్‌ల్లోని అదనపు సభ్యులను గుర్తించడానికి, ట్రాక్ చేయడానికి, అరెస్టు చేయడానికి ఏజెన్సీ అనేక రాష్ట్రాలలోని పోలీసు దళాలతో కలిసి పనిచేసోందని, దర్యాప్తు నిర్వహిస్తోందని ఎన్‌ఐఏ పేర్కొంది.