07-07-2025 01:00:00 AM
ఆస్పత్రులకు రోగుల తాకిడి
రోగ నిర్ధారణ పరీక్షలకు వెతలు
గ్రామాల్లో కానరాని వైద్యశిబిరాలు
మణుగూరు, జూలై 6 (విజయక్రాంతి): మండలంలోని పలు పల్లెలతో పాటు, మున్సిపాలిటీ పరిధిలోని కాలనీలలో జ్వరా లు దడ పుట్టిస్తున్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని కమలాపురం, చిన్నరాయి గూడెం, అన్నారం, శివలింగాపురం ఏరియాలో తో పాటు, మండలం లోని రామాను జవరం, పగిడేరు,సాంబాయి గూడెం, సమితి సింగా రం, కూనవరం పంచాయతీలలో జ్వరాలు ప్రజలను కలవరపెడుతున్నాయి.
ఓవైపు వ ర్షాలు కురుస్తుండటం, పారిశుద్ధ లోపం కారణంగా వైరల్ ఫీవర్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దాంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల ముందుజనాలు క్యూ కడుతున్నారు. వీటితో పాటు మలేరియా, డెంగీ అనుమానిత కేసులు వెలుగు చూస్తుండటం ఆందోళనకు గురి చేస్తున్నాయి.
ఇంటికొకరికి సుస్తీ : మున్సిపాలిటీ తో పాటు పంచాయతీలలో పారిశుధ్యం అధ్వానంగా మారడం, అధికారులు పట్టించుకోపో వడంతో సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయని, ప్రజల ఆరోపిస్తున్నారు.కొందరు జ్వర పీడితులు మంచం పట్టి ఇళ్లకే పరిమితమవుతుండగా, మరికొందరు ఎలాంటి జ్వరమో అనే ముందస్తు భయంతో ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు.
అన్ని రకాల రక్త నమూన పరీక్షలు చేయించుకుంటూ వైద్యుల సలహా మేరకు రోజులపాటు ప్రైవే ట్ ఆసుపత్రుల్లోనే గడుపుతున్నారు. దీంతో ఇళ్లు,ఒళ్లు గుళ్ల చేసుకుంటూ ఆర్థికంగా చికితిపోతున్నారు.
కిటకిటలాడుతున్న ప్రభుత్వ దవఖాన ...
సీజనల్ వ్యాధుల నేపథ్యంలో రోగులతో ప్రభుత్వ దవాఖాన కిటకిటలాడుతుంది. రో జువారి ఓపి లా సంఖ్య అధికంగా ఉంటోం ది. ప్రస్తుతం వంద పడకల ఆసుపత్రి లో కావాల్సిన మందులు, అన్ని రకాల పరీక్షలు అందుబాటులో ఉండటంతోపాటు.. ఇన్ పే షెంట్కు బెడ్లు కూడా అందు బాటులో ఉం టున్నాయి. దీంతో జ్వర పీడితులు ప్రభుత్వ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు.
ఓపీకి వచ్చే జ్వర పీడితుల సంఖ్య అధికంగా ఉండటంతో.. ఆసు పత్రిలో క్యూలైన్లు దర్శనమి స్తున్నాయి. జ్వర తీవ్రత ఎక్కువగా ఉన్నవారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి.. చికిత్స చేయించుకుంటున్నారు.
ఆరోగ్య శాఖ అవగాహన కార్యక్రమాలు నిల్
సీజనల్ వ్యాధులు,దోమల నివారణకు అటు వైద్య ఆరోగ్యశాఖ, ఇటు మున్సిపల్ అధికారులు పెద్దగా దృష్టి సారించడం లేద నే ఆరోపణలున్నాయి. డెంగీ కేసు నమోదైతే ఆ ఇంటికి వెళ్లి దోమ లార్వాను గుర్తించాలి. ఇంట్లో వాళ్లతో పాటు చుట్టపక్కల 50 ఇళ్లవారి నుంచి శాంపిళ్లు సేకరించాలి. అంతేకా కుండా ఇంటింటా జ్వర సర్వే నిర్వహించాలి. దోమల నివారణకు రసాయనాలు స్ప్రే చేయాలి.
అదే విధంగా దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, దోమల వల్లా వచ్చే వ్యాధులు గురించి అవగాహన కల్పించాలి. కానీ ఈ ప్రక్రియ అంతా సంబంధిత శాఖల అధికారులు తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారనే విమర్శలున్నాయి.
సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వైద్య శిబిరాలు నిర్వహించి పరీక్షలు చేసి మందులు ఇవ్వా ల్సి ఉన్నా ఆ దిశగా దృష్టిసారించడం లేదని తెలుస్తోంది. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు, ఉన్నతాధికారులు సీజనల్ వ్యా ధులు, జ్వరాల నివారణకు యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి..
డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి విష జ్వరాలకు సంబంధించిన అన్ని పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటు లో ఉన్నాయని,ఆసుపత్రి సూపరిండెం ట్ సునీల్ మంజేకర్ వెల్లడించారు. పూ ర్తిస్థాయి వైద్యం అందుబాటులో ఉన్నదని, ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు,
సిబ్బంది కృ షి చేస్తున్నారని ఆయన తెలిపారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమ త్తంగా ఉండాలని,.డెంగీ, మలేరియా, టై ఫాయిడ్ మొదలగు వ్యాధుల భారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సూచించారు.
సునీల్ మంజేకర్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్