calender_icon.png 23 November, 2025 | 8:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగర కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ కు పలువురి అభినందనలు

23-11-2025 07:41:51 PM

కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వైద్యుల అంజన్ కుమార్ ను కాంగ్రెస్ అధిష్టానం నియమించిన సందర్భంగా కరీంనగర్ పట్టణంలో పలువురు ఆయనను కలుసుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి, మాజీ కార్పోరేటర్ పడిశెట్టి భూమయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వైద్యుల అంజన్ కుమార్ ను ఘనంగా సత్కారించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 10వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ బత్తిని కన్నయ్య గౌడ్, వీర దేవేందర్ పటేల్, అనిల్ గుప్తా, తదితరులు పాల్గొన్నారు.