23-11-2025 08:19:02 PM
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపిన ఈస్ట్ బోడుప్పల్ యాదవ సంఘం సభ్యులు..
మేడిపల్లి (విజయక్రాంతి): ఇటీవలే జూబ్లీహిల్స్ నూతన ఎమ్మెల్యేగా గెలుపొందిన సందర్భంగా జూబ్లీహిల్స్ లోని వారి స్వగృహంలో ఈస్ట్ బోడుప్పల్ యాదవ సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యాదవ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవడం మాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. నవీన్ యాదవ్ ఇంకా ఎన్నో పదవులు అవరోధించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ బోడుప్పల్ అధ్యక్షుడు కొండ ఐలయ్య యాదవ్, జనరల్ సెక్రెటరీ సోమరాజు యాదవ్, మాజీ అధ్యక్షుడు అంజయ్య యాదవ్, మాజీ ఉపాధ్యక్షుడు నర్సింగ్ యాదవ్, వెంకన్న యాదవ్, రాజు యాదవ్, సాంబయ్య, మల్లికార్జున్, మురళీమోహన్, యాదవ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.