23-11-2025 08:21:15 PM
భారీగా హాజరైన చిన్నారులు..
తాండూరు (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మారేపల్లిలో నేడు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం నాలుగవ వారం ఘనంగా జరిగింది. విశ్వహిందూ పరిషత్ నాయకులు భాస్కర్ జి నేతృత్వంలో శ్రీరాముడు, శ్రీ ఆంజనేయ స్వామి చిత్రపటాలతో పాటు భరతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయానికి విచ్చేసిన చిన్నారులకు భాస్కర్ జి హనుమాన్ చాలీసా విశిష్టతను తెలుపుతూ పారాయణం చేశారు. స్వామివారికి హారతి నిర్వహించి చిన్నారులకు తీర్థ ప్రసాదాలు.. మురళి గౌడ్ అల్పాహారం వితరణ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు చిన్నారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.