23-11-2025 08:28:31 PM
సదాశివపేట (విజయక్రాంతి): సదాశివపేట మండలం కంబాలపల్లి గ్రామంలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తనయుడు చింత సాయినాథ్ కుటుంబ సభ్యులతో సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుల మంత్రోచ్ఛారణ మధ్య ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ప్రాంత ప్రజల అభ్యున్నతితో పాటు నియోజకవర్గ శాంతి, శ్రేయస్సు కోసం చింత సాయినాథ్ ప్రత్యేకంగా ప్రార్థించనని అన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పెద్దగొల్ల ఆంజనేయులు, గ్రామ మాజీ సర్పంచ్ శ్రీహరి ,గ్రామ శాఖ అధ్యక్షులు సుధీర్ రెడ్డి, వంగపల్లి మల్లేశం, చీమల దరి సుభాష్, గొల్ల కృష్ణ, బుజంగం శ్రీశైలం అరవింద్, రవి జగదీష్ పంతులు తదితరులు ఉన్నారు