calender_icon.png 23 November, 2025 | 8:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నరసింహుని ఆలయంలో భక్తుల రద్దీ

23-11-2025 08:17:11 PM

మంగపేట (విజయక్రాంతి): తెలంగాణలో రెండవ యాదాద్రిగా పిలువబడే మల్లూరు శ్రీ హేమచల శ్రీ నృసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ ఆదివారం సెలవు కావడంతో కుటుంబ సభ్యుల పరంగా దైవదర్శనానికి స్వామివారి ఆలయంలో దూర ప్రాంతాల నుండి భక్తులు మల్లూరు గుట్టకు చేరుకొని ముందుగా చింతామణి జలపాతం వద్ద స్నానాలు ఆచరించి జలంజనేయ స్వామిని దర్శించి ఆలయంలో భక్తుల రద్దీతో హరి నామస్మరణంతో ఆలయం మార్మోగింది. వచ్చిన భక్తులకు ఆలయ అర్చకులు అర్చనలు అభిషేకాలు చేసి తీర్ద ప్రసాదసాలు భక్తులకు అందజేశారు.