16-08-2025 12:00:00 AM
‘రెనోవా’ హాస్పిటల్స్ స్వాతంత్య్ర వేడుకల్లో వక్తలు
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 15 (విజయక్రాంతి): రెనోవా ఎన్‌ఐజిఎల్ హాస్పిటల్స్, రోడ్ నం.12, బంజారాహిల్స్ హైదరాబాద్‌లో 79వ స్వాతంత్య్ర వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులు స్రవంతి పెదిరెడ్డి, డైరెక్టర్, రెనోవా గ్రూప్ అఫ్ హాస్పిటల్స్, డాక్టర్ నమ్రత శర్మ, డైరెక్టర్, రెనోవా ఎన్‌ఐజిఎల్ హాస్పిటల్స్, డాక్టర్ కళ్యాణి బిక్కాసాని, డైరెక్టర్, రెనోవా ఎన్‌ఐజిఎల్ హాస్పిటల్స్, నీలిమా ఓదెల, డైరెక్టర్, రెనోవా ఎన్‌ఐజిఎల్ హాస్పిటల్స్ కలిసి జాతీయ జెండాను ఎగురవేసి, జాతీయ గీతాన్ని ఆలపించారు.
అనంతరం హాస్పిటల్ సెక్యూరిటీ సిబ్బంది మార్చ్ ఫాస్ట్ చేయడం ద్వారా వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మన స్వేచ్ఛ కోసం పోరాడిన మహనీయులెందరోనని, వారి ఆకాంక్షలన్నింటినీ నిలబెట్టుకోవడం మన భాద్యత అని చెప్పారు. బాధ్యాతాయుతమైన పౌరులుగా ఎదగాలని సూచించారు. డాక్టర్ ఆర్ వి రాఘవేంద్రరావు, డైరక్టర్, సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు అండ్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, రెనోవా ఎన్‌ఐజిఎల్ హాస్పిటల్స్ అందరికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ రాకేష్ శర్మ, డైరెక్టర్, రెనోవా ఎన్‌ఐజిఎల్ హాస్పిటల్స్, డాక్టర్ పాలంకి సత్య దత్తాత్రేయ, డైరెక్టర్, చీఫ్ అఫ్ మెడికల్ ఆంకాలజీ సర్వీసెస్, రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్, కార్ఖానా, డాక్టర్ యుగంధర్ శర్మ, సీనియర్ కన్సల్టెంట్ మరియు హెడ్ డిపార్టుమెంట్ అఫ్ రేడియేషన్ ఆంకాలజీ, రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్, కార్ఖానా, డాక్టర్ రవి కిరణ్, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, రెనోవా ఎన్‌ఐజిఎల్ హాస్పిటల్స్, డాక్టర్ రాధాకృష్ణ రావు సాగి, సీఈవో, రెనోవా మిడ్ లెవల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, రవీంద్రనాథ్ గరగ, సీవోవో, రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, రామసుబ్బారెడ్డి కొమ్మన, సెంటర్ హెడ్, రెనోవా ఎన్‌ఐజిఎల్ హాస్పిటల్స్ తదితరులు పాల్గొన్నారు.