16-08-2025 03:49:27 PM
చిక్కుకున్న నలుగురు యువకులను కాపాడిన స్థానికులు..
బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District)లో శనివారం కురిసిన భారీ వర్షానికి కాసిపేట మండలంలోని బుగ్గ చెరువు మత్తడి ఉప్పొంగింది. మత్తడి వద్ద చేపలు పట్టేందుకు వెళ్లిన నలుగురు యువకులు వరద ప్రవాహంతో మత్తడి ఒడ్డు వద్దే చిక్కిపోయారు. ఇది తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకునేసరికి వరద పెరిగిపోయింది. నలుగురు యువకులు అవతలి ఒడ్డున ఉండటాన్ని చూసి.. తాళ్ళ సహాయంతో యువకులను ఇవతలి ఒడ్డుకు చేర్చారు. దీంతో నలుగురు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు.