16-08-2025 03:55:30 PM
పాడైపోయిన రోడ్లను మరమ్మతులు చేయాలని అధికారులకు ఆదేశాలు..
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన..
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ ప్రధాన రహదారి మధ్యన ఉన్న అంతపూర్ తడుగురు వాగులు పొంగిపొర్లి దిగువ భాగాన ఉన్న సోమూరు, చిన్న ఏక్లారా గ్రామాల మధ్యలో ఉన్న లో లేవల్ వంతెనలపై వరద పారడంతో రోడ్లన్నీ పాడైపోయాయి. ఈ ప్రాంతాలను శనివారం బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సందర్శించారు. ఈ సందర్భంగా పాడైపోయిన రోడ్లను వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. మద్నూర్ జుక్కల్ రహదారిలోని అంతాపూర్ తాడు గురు వద్ద వాగు వరదదాటికి పాడిన రోజు రిపేర్ అయ్యేంతవరకు రోడ్డును మూసి వేస్తున్నట్లు తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఇంటి నుంచి బయటకు రావద్దని అన్నారు. జుక్కల్, మద్నూర్ మండలాల మధ్యగల గ్రామాల మధ్యలో వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. ప్రజలు వర్షాలు తగ్గేవరకు ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఎవరు ప్రయాణాలు చేరదని సబ్ కలెక్టర్ సూచించారు. సబ్ కలెక్టర్ కిరణ్ మై తో పాటు మద్నూర్ తాసిల్దార్ ఎండి ముజీబ్, ఎంపీడీవో రాణి, ఎస్ హెచ్ విజయ్, ఆర్ అండ్ బి ఏ ఈ తదితరులు పాల్గొన్నారు.