16-08-2025 04:06:16 PM
మరో ఇద్దరు రైతులకు తీవ్ర గాయాలు..
బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) భీమిని మండలం వెంకటాపూర్ గ్రామంలో శనివారం పత్తి చేనులో పనులకు వెళ్లిన రైతులపై అడవి పంది ఒక్కసారిగా దాడికి పాల్పడింది. ఈ దుర్ఘటనలో రాములు(70) అనే రైతు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది.