calender_icon.png 16 August, 2025 | 5:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిట్యాల సీఐ, ఎస్సై, ఎంపీడీవోలకు ఉత్తమ సేవా పురస్కారం

15-08-2025 11:31:19 PM

చిట్యాల,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల సీఐ దగ్గు మల్లేష్ యాదవ్, ఎస్సై జి. శ్రావణ్ కుమార్, ఎంపీడీవో జయశ్రీ ఉత్తమ సేవ పురస్కారం అందుకున్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలో జరిగిన  79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ కార్గే చేతుల మీదుగా వారు అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా చిట్యాల పరిధిలోని ప్రజలు  అభినందించి,సేవలను ఇంకా ఇలాగే కొనసాగిస్తూ మరెన్నో అవార్డులు అందుకుంటూ,ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.