calender_icon.png 16 August, 2025 | 5:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యాంగుల పెట్రోల్ బంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

16-08-2025 03:47:08 PM

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల, బొప్పాపూర్ లోని అంగన్వాడీ కేంద్రం ఆకస్మిక తనిఖీ

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఫిల్లింగ్ స్టేషన్ తనిఖీ

రాజన్న సిరిసిల్ల: దివ్యాంగుల పెట్రోల్ బంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(Collector Sandeep Kumar Jha) పిలుపునిచ్చారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని బైపాస్ రోడ్ లో ఉన్న డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఫిల్లింగ్ స్టేషన్ ను కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న దివ్యాంగులతో మాట్లాడి, వారికి ఎదురవుతున్న సాధక బాధలను అడిగి తెలుసుకున్నారు. అలాగే మరింత ముందుకు తీసుకొని వెళ్లడానికి టర్నోవర్ పెంచడానికి అన్ని ప్రభుత్వ వాహనాలను ఇక్కడే డీజిల్ పెట్రోల్  పోయించుకోవాలని అందరికీ సూచించాలని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజంను ఆదేశించారు. అలాగే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు, వ్యక్తిగత వాహనాలు ఇక్కడ లభించే నాణ్యమైన, డీజిల్ పెట్రోల్ని తీసుకొని దివ్యాంగులకు ఆర్థిక పునరావాసంలో అందరూ  భాగస్వాములు అవ్వాలని పిలుపు ఇచ్చారు.

అలాగే ఇక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలించి వ్యాపార దృక్పథంతో మరింత ముందుకు వెళ్లడానికి తగు ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా సంక్షేమ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రం తనిఖీ ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో లబ్ధిదారులకు అందిస్తున్న సేవలు గురించి ఆరా తీశారు. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం గురించి పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు.లబ్ధిదారులకు నాణ్యమైన సేవలు అందించాలని జిల్లా సంక్షేమ అధికారిని కలెక్టర్ ఆదేశించారు.