16-08-2025 03:36:32 PM
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ..
దేవరకొండ: వికలాంగుల పెన్షన్ రూ.6 వేలకు.. వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలు అన్ని రకాల చేయూత పెన్షన్లు రూ.4 వేలకు పెంచాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ(MRPS State President Govindu Naresh Madiga) డిమాండ్ చేశారు. శనివారం కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని బీసీ కాలనీలో చేయూత పెన్షన్ దారుల సమావేశం వారు మాట్లాడుతూ, 2023 ఎన్నికల సమయంలో వికలాంగుల పెన్షన్ 6 వేలు, మిగతా చేయూత పెన్షన్ దారుల పెన్షన్ రూ 4 వేలకు పెంచుతామని రేవంత్ రెడ్డి బహిరంగంగా హామీ ఇచ్చారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని వారు ఉన్నారు. ఆదివారం దేవరకొండ మార్కెట్ యార్డులో నిర్వహిస్తున్న మహాసభకు పెద్ద ఎత్తున పింఛన్ల లబ్ధిదారులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ కొండమల్లేపల్లి మండల అధ్యక్షులు ఎదుళ్ల ఎల్లయ్య మాదిగ, వంగూరి ప్రసాద్ మాదిగ తదితరులు పాల్గొన్నారు....