calender_icon.png 25 October, 2025 | 2:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

25-10-2025 01:01:17 AM

షాద్ నగర్,అక్టోబర్ 23 : తమ పశువులకు సీజన్లో సోకే వ్యాధులను నివారించేందుకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను  తప్పనిసరిగా వేయించాలని  జిల్లా పశు వైద్యాధికారి మధుసూదన్ కోరారు. శుక్రవారం  ఫరూక్ నగర్ మండలంలో  విట్యాల, రాసమల్లగూడ గ్రామాల్లో నిర్వహించిన గాలికుంటు  నివారణ టీకాలు కార్యక్రమం ను   జిల్లా పశువైద్య మరియు పశు సంవర్ధక శాఖాధికారి డాక్టర్ మధుసూదన్ ఆకస్మిక తనిఖీ చేశారు. 

ఈ సందర్భంగా రైతులకు పలుకు సలహాలు సూచన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాడి రైతులు అందరూ పశువులన్నింటికీ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ  టీకాలు వేయించాలని సూచించారు. కార్యక్రమంలో ఏరియా వెటర్నరీ హాస్పిటల్ షాద్ నగర్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ విజయకుమార్ రెడ్డి, పశువైద్యాధికారులు డాక్టర్ ముక్కంటి రాజ్, డాక్టర్ సునీత, పశు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.